Seetharama Project: రైతులకు పండగే.. పంద్రాగస్టు రోజు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..
- రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త..
- ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభం..
- లక్ష ఎకరాలకు సాగు నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetharama Project: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీంతో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించారు.
Read also: Glass Tube Center : రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కలలు సాకారమయ్యే రోజు వచ్చిందని ఉత్తమ్ అన్నారు. మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను గత జూన్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల రెండో తేదీన రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దశాబ్దాల కల సాకారమవుతోందన్నారు. ఇకపై రైతుల కష్టాలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. రైతుల కళ్లలో ఆనందం చూడడమే తన లక్ష్యమని వెల్లడించారు.
Read also: Iran Israel War : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 29 మంది ఉరి
సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈనెల 11న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రాజెక్టులోని రెండో పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తారు. మూడో పంపు ట్రయల్ రన్ పూర్తి చేసిన అనంతరం వైరాలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభను మంత్రి ఉత్తమ్ పరిశీలించనున్నారు. అనంతరం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దున్నపోతుల గండి వద్ద ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం స్థలాన్ని పరిశీలించనున్నారు. స్థల పరిశీలన అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారు.
Tollywood Producer: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!