Site icon NTV Telugu

Hyderabad: గచ్చిబౌలి పీఎస్ పరిధిలో అక్క తమ్ముడు మిస్సింగ్..

Hyd Missing

Hyd Missing

అక్క తమ్ముడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్లో జరిగింది. తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది అక్క. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలంకు చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్లో తన మేనమామ నరేష్ వద్ద నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క హారిక(20), తమ్ముడు ఫణీంద్ర(19)లను తనవద్దే ఉంచుకొని చిన్నప్పటి నుండి పెంచి, చదువు చెప్పిస్తున్నాడు మేనమామ నరేష్.

Read Also: Nitish Kumar Reddy: అంత బిజీగా ఉన్నా.. నాకు మెసేజ్‌ చేశాడు!

కాగా.. తన మేనకోడలు హారికను 2022 మే 10వ తేదీన నరేష్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హారిక బీటెక్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో.. కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోయారు అక్క తమ్ముడు హారిక, ఫణీంద్ర. అంతేకాకుండా.. వారు వెళ్లిపోతూ ఒక లెటర్ కూడా రాసి పెట్టి వెళ్లారు. తమ కోసం వెతకవద్దంటూ లెటర్ రాశారు. అప్పటి నుండి ఇద్దరి కోసం కుటుంబసభ్యులు వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు భర్త నరేష్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read Also: Tollywood: ఒక్క క్లిక్.. మూడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్..మ్యాటర్ ఏంటంటే..?

Exit mobile version