నకిలీ కాల్ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగేళ్ళ వ్యవధిలో 1000 కోట్లు మోసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో ఈ ముఠా కార్యకలాపాలు నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ను టార్గెట్‌గా చేసుకొని బురుడి కొట్టించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. యూకే , ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల క్రెడిట్ కార్డ్ లకు ఇండియా బ్యాంక్‌లు ప్రాంఛైజ్ ఉండడంతో ఈ ముఠా ఎంపిక చేసుకుందని, మీ సిస్టమ్‌లో మాల్వేర్ వైరస్ అటాక్ అయ్యిందని చెప్పి, క్రెడిట్ కార్డుల డీటైల్స్ తీసుకొని కోట్లు రూపాయలు ముఠా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ సమాచారాన్ని గూగుల్ యాడ్స్ ద్వారా సేకరించినట్లు విచారణలో తేలిందని, రెండు టోల్ ఫ్రీ నంబర్లు నుండి 1లక్ష 33 వేల మంది కస్టమర్లను మోసం చేసినట్లు, 80 మంది టెలికాలర్స్ నియమించుకొని మోసాలకు తెరలేపినట్లు విచారణలో బయటపడిందన్నారు. అంతేకాకుండా దుబాయ్‌లో మరో రెండు ముఠాలు ఉన్నట్లు గుర్తించినట్లు, విచారణ కొనసాగుతోందని పోలీసుల వెల్లడించారు.
