K. Laxman: ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని.. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విభజన అంశాల విషయం లో ప్రాంతీయ ను రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగించుకోవద్దని తెలిపారు. కేంద్రం, మోడీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాస్తున్నా అన్నారు. భారత దేశ సమగ్రత కోసం తన ప్రాణాలు సైతం అర్పించారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అన్నారు. భావితరాలకు, నేటి తరాలకు స్ఫూర్తిని కలిగించేలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పశ్చిమ బెంగాల్ ను తూర్పు పాకిస్తాన్ లో కలుపుతారనే కుట్రల నేపథ్యంలో ఎదురొడ్డి నిలబడ్డారని తెలిపారు.
Read also: Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?
శ్యామా ప్రసాద్ ముఖర్జీ చొరవ వల్ల పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉండి సురక్షితంగా జీవించగల్గుతున్నారని తెలిపారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగ ఫలితమే నరేంద్ర మోదీ 370ఆర్టికల్ ను రద్దు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను మరిచిపోయి మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిందని తెలిపారు. 370ఆర్టికల్ తర్వాత నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. మోడీ ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందన్నారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భారత దేశం విచ్చిన్నానికి కాంగ్రెస్ పాల్పడిందన్నారు.
Redmi A3X : లాంచ్ చేయకుండానే అమ్మకాలను మొదలు పెట్టేసిన అమెజాన్..