NTV Telugu Site icon

Minister Seethakka: కష్టాన్ని నమ్ముకున్న.. మంత్రి గా సేవలందిస్తున్న..

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకున్నా. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా సేవలందిస్తున్న అని మంత్రి సీతక్క అన్నారు. మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్ లో CII ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును సీతక్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు సమాజ సృష్టికర్తలు అన్నారు. కానీ మహిళలను చిన్నచూపు చూసే మెంటాలిటీ ఉందన్నారు. అందుకే మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్న ..పురుషులే గొప్ప అనే భావన ఉందన్నారు. తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకుని పనిచేసానని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా సేవలందిస్తున్నా అన్నారు. ఆదివాసి మహిళకు పంచాయతీరాజ్ వంటి వంటి పెద్ద శాఖను నాకు ఇచ్చారని తెలిపారు. 13 వేల గ్రామపంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను నాకు అప్పచెప్పారని తెలిపారు. బాధ్యతలు స్వీకరించి పట్టుదలతో పనిచేస్తున్న అన్నారు. పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలన్నారు.

Read also: Etala Rajender: బ్యాంకులు షరతులు లేకుండా పేదలకు రుణాలు ఇవ్వాలి..

వర్క్ ప్లేస్ లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందన్నారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలిపారు. మీకు ఎదురవుతున్న సవాళ్లను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తామన్నారు. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదన్నారు. వ్యాపారాలు, వ్యాపారవేత్తలు పట్టణాలకే పరిమితం కాకూడదన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఒక గ్రామీణ బిడ్డగా నేను అదే కోరుకుంటున్నా అని తెలిపారు. స్థానిక వనరుల కేంద్రంగా వ్యాపార అభివృద్ధి జరగాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దృష్టి పెట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తున్నారని.. సవాల్లు ఎదురైనప్పుడు పారిపోకూడదన్నారు. సవాల్లను చాలెంజ్ గా తీసుకొని మహిళలు నిలదిక్కుకోవాలన్నారు. మహిళా భద్రత, సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Read also: Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో నిజామాబాద్ విద్యార్థి మృతి..

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మా ప్రభుత్వo ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మహిళా భద్రత కోసం టి సేఫ్ యాప్ తీసుకొచ్చామన్నారు. ఇతర రాష్ట్రాలకు టి సేఫ్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. లింగ సమానత్వం రావాలంటే అన్నిచోట్ల మహిళలు ముందుకు రావాలన్నారు. మహిళలపై ఎలాంటి వివక్షత చూపకుండా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. మహిళలను uplift చేసే విధంగా అంతా పనిచేయాలన్నారు. పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న మహిళలు, వెనుకబాటుతనంలో ఉన్న మహిళలకు తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. అప్పుడే మహిళాలు అభివృద్ధి బాటలో పరిగెత్తగలరని..మహిళలకు మానవత్వం ఎక్కువ అని తెలిపారు. సమస్యల్లో ఉన్నవారికి అక్కలా చెల్లెలా తల్లిలా చేయూత నివాళన్నారు. యంగ్ ఇండియాలో నిరుద్యోగము పెద్ద సమస్య గా మారిందన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకిత భవంతో మీ సేవలను అందించాలని.. ఒకరికొకరు ఆసరాగా ఉండి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు.
Phone Tapping Case: ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసులు..

Show comments