KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..
- జీఎస్టీ-రైతు బంధుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఫైర్..
- నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..
- తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి అని, తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..! పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే..అన్నదాత వెన్ను విరవడమే..! అన్నారు. రైతు ద్రోహి కాంగ్రెస్..చరిత్ర నిండా అనేక రుజువులు..ఇప్పుడు ఇంకొకటి ! అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..?
రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!
ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!
పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3
— KTR (@KTRBRS) October 21, 2024
Read also: Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
జీఎస్టీపై కేటీఆర్ మరో ట్విట్..
తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అని తెలిపారు. గతేడాది తో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణ లో జీఎస్టీ వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. GST వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేదన్నారు. తెలంగాణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీపడుతోందని అన్నారు. విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలనిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం అని తెలిపారు. ఈ తిరోగమన పరిస్థితి పై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
When you emulate Bulldozer Raaj, the results will be a bulldozer economy!
For the first time Telangana’s GST collection nosedived to less than 1pc. YOY, Telangana always showed a growth of at least 15pc in GST collections
Telangana is now successfully competing with Uttar… pic.twitter.com/Bo7OpEAU7Z
— KTR (@KTRBRS) October 21, 2024
Telangana Ministers: నేడు దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన..
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి