NTV Telugu Site icon

CM Revanth Reddy: రేపు రాష్ట్ర బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రైతులను ఉద్దేశించి సందేశం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ప్రజాభవన్ లో రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్దాయి బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొననున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. రూ. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించనున్నారు.

Read also: CM Revanth Reddy: కుక్కలలో దాడి బాలుడు మృతి ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన సీఎం..

దీంతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపు నిచ్చారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి లక్ష రుణమాఫీ చేయనున్నారు. ఒకటి, రెండు రైతులతో సీఎం స్వయంగా మాట్లాడనున్నారు.
ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా తొలి విడతగా రూ.లక్ష మేర రుణాలున్న రైతుల ఖాతాల్లో రేపు (గురువారం) నగదు జమ జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబురాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Insta Reels Viral: ఏకంగా లాకప్‌ లో ఉన్న ఫ్రెండ్ తో రీల్స్‌.. పోలీసులు అంటే లెక్కలేదా?