Shashank Manu: శశాంక్ మను అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన వాడు. ఇతను ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. శశాంక్ కు మెట్రోలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు.. అతి తక్కువ కాలంలో మెట్రోలో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సంపాదించాలన్నదే ఇతని ఆశయం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రలో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రోతోనే అతని ప్రయాణం ఆపలేదు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు శశాంక్.
హైదరాబాద్ మెట్రో రైలును మూడు కారిడార్లలో 57 స్టేషన్లలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్‌లను అత్యంత వేగంగా ప్రయాణించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లన్నీ 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించి రికార్డు సృష్టించాడు. ప్రజా రవాణాను, భారతదేశంలో ప్రపంచ స్థాయి మెట్రో సౌకర్యాలను ప్రోత్సహించడానికి శశాంక్ మను మెట్రో నగరాల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. అందరిని మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించడమే కాకుండా.. అతి తక్కువ గంటల్లో ప్రయాణించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లను తన సొంతం చేసుకుంటున్నాడు.
Read also: SC Railway Special trains: ప్రయాణికులకు శుభవార్త.. దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు..
శశాంక్ మను ఏప్రిల్ 14, 2021 న, అతను ఉదయం 5 గంటలకు మెట్రో బ్లూ లైన్ నుండి తన ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ సమీపంలో ఉన్న బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్ వద్ద రాత్రి 8:30 గంటలకు తన మెట్రో ప్రయాణాన్ని ముగించాడు. ఆ రోజు మొత్తం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఢిల్లీ మెట్రోలోని 286 స్టేషన్లను సందర్శించానంటూ సమయంతో సహా తను ట్వీట్ కూడా చేశాడు.
అయితే ఢిల్లీ, హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి రికార్డు తన సొంతం చేసుకున్న శశాంక్ మను ఇప్పుడు బెంగుళూరు మెట్రోలో ప్రయాణించి రికార్డు సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్నాడా? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే స్థానికులు చెప్పటినట్లు బెంగళూరులోని మెట్రలో ప్రయాణించి శశాంక్ రికార్డు బద్దల కొడితే మూడు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న ఖాతాలో శశాంక్ పేరు చరిత్రలో నిచిపోతుంది. అయితే శశాంక్ నెక్ట్ టార్గెట్ బెంగుళూరు మెట్రోనా? లేక మరేమైనా ఉందా అనే దానిపై కొద్ది రోజులు ఆగాల్సిందే మరి. కంగ్రాట్స్ శశాంక్ బ్రో అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
Fridge Explodes: ఉమెన్స్ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్.. ఇద్దరు యువతులు మృతి!