NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైంది..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నమన్నారు. దసరా పండుగకు ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైందని అన్నారు. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావలసిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని చెప్పాము ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 12th క్లాస్ వరకు విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ కళాశాలలు పక్కాభవనాలు లేక కళ్యాణ మండపాలు, అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Read also: Atla Bathukamma 2024: నేడు ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యంగా అట్లు లేదా దోశ..

బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని ఇందిరమ్మ ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. 20 నుంచి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గములో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం.. ఇప్పటివరకు 25 నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఇతర వివరాలు పంపారు వాటిని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణాలు ప్రారంభిస్తున్నామన్నారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్మాణాలు ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. దసరా పండగకు ముందు రోజే రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి మూడు నెలలుగా కసరత్తు చేసి ఓ రూపానికి తెచ్చిన యావత్ మంత్రిమండలి, చీఫ్ సెక్రటరీ మొదలు వివిధ శాఖల ఉన్న అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉండగా ఇందులో 662 పాఠశాలలో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని అన్నారు.

Read also: Tongue Colors: మీ నాలుక ఈ రంగుల్లో ఉంటే సంకేతం ఇదే..

ఈ ఒక్క సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలపై ఐదు వేల కోట్లు ఖర్చు చేయబోతుంది గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక ఏడాదిలో కేటాయించిన మొత్తం 73 కోట్లు మాత్రమే అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలి వాటం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆధునిక రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట ఓ కుటుంబములా చదువుకునే లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. కేవలం చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణ కాకుండా క్రీడలు, వినోదం వంటివి విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏ కొరత లేకుండా చూసే కార్యక్రమంలో భాగంగా థియేటర్ నిర్మించి శాటిలైట్ ద్వారా పిక్చర్స్ సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామన్నారు. పేద వర్గాల వారు వారి బిడ్డలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.

Anasuya Bharadwaj: అను ఏంటి కొత్త అవతారం..స్టైలిష్ హెయిర్ స్టైల్ తో క్రేజీ లుక్స్‌..