NTV Telugu Site icon

RTC MD Sajjanar: పిల్లాడి ప్రాణంతో రిస్క్ అవసరమా..? సజ్జనార్‌ ఫైర్‌..

Sajjanar

Sajjanar

RTC MD Sajjanar: సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను పంచుకోవడం ద్వారా పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు.

Read also: Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..

తాజాగా ఓ మహిళ బావి గోడపై కూర్చోని చిన్న పిల్లాడితో ప్రమాదకరమైన వీడియో చిత్రీకరించింది. బావి గోడ అంచున కూర్చున్న ఓ మహిళ సుమారు రెండు మూడేళ్ల వయస్సు కలిగిన పిల్లవాడిని బావి లోపలివైపుకు ఉంచి బాలుడు చేతిని పట్టుకొని ఉంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడు బావిలో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితే ఉందని, ఎక్కడ తాను పడిపోతానో అంటూ భయపడుతూ గట్టిగా ఆ మహిళ కాలును పట్టుని కూర్చోవడంపై సోషల్ మీడియాలో అందరూ మండిపడుతున్నారు. బాలుడి ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంపై నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి.. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అంటూ సజ్జనార్‌ తెలిపారు.


Bandi Sanjay: డ్రగ్స్‌ కేసు విచారణ ఏమైంది.. బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..