NTV Telugu Site icon

RamNagar Siddiq Ganesh 2024: మత సామరస్యం అంటే ఇదే కదా.. 19 ఏళ్లుగా గణపతి సేవలో ముస్లిం యువకుడు

Ramnagar Siddiq Ganesh 2024

Ramnagar Siddiq Ganesh 2024

RamNagar Siddiq Ganesh 2024: మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు.. ప్రతీ ఏడాది గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.. ఫారిన్ నుండి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు.. ప్రతీ ఏడాది మూడు నెలల ముందే వచ్చి.. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు.. ఇది ఏ ఒక్కసారికే పరిమితం కాలేదు.. వరుసగా 19 ఏళ్ల నుంచి గణేష్‌ నవరాత్సి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ.. తాను ముస్లిం అయినా.. అన్ని మతాలను గౌరవిస్తానని అంటున్నాడు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయని . తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఇష్టం అంటున్నాడు మహమ్మద్ సిద్ధిఖీ.. ముఖ్యంగా గణేష్‌ నవరాత్రులంటే తనకు చాలా మక్కువ.. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబరాలు చేసుకోవడం చూసి తాను కూడా అందులో పాల్గొనేవాడినని.. అంతేకాదు.. తన చిన్నతనంలో గణేష్‌ వల్ల మంచి జరగడంతో.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా.. గణేష్‌ నవరాత్రుల్లో పాల్గొంటున్నాడు.. ఇంతకీ మహమ్మద్‌ సిద్ధిఖీ.. గణేష్‌ ఉత్సవాల గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments