Site icon NTV Telugu

MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh: ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరుగవచ్చని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలిని కోరుకుంటున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఢిల్లీలో రావుస్ IAS స్టడి సర్కిల్ లో సెల్లర్లో మునిగి ముగ్గురు చనిపోయారని తెలిపారు. తెలంగాణకు చెందిన తనీయా ఈ ఘటనలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తనియా కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరుతున్నా.. ఢిల్లీలో మాదిరిగా ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు హైదరాబాద్ లో నడుస్తున్నాయని తెలిపారు. గోషామహల్ లో ఇల్లీగల్ బిల్డింగ్స్ అనేకం ఉన్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి పెట్టాలన్నారు.
గోషామహల్ లో ఇల్లీగల్ గోడౌన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. బిల్డింగ్ ల దగ్గర నిలబడి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని కట్టడి చేయడానికి సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Read also: Mallu Bhatti Vikramarka: బోనాల జాతర కు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది..

హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం పై రాజా సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అన్నారు. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం అని తెలిపారు. తాన్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్ లోనూ ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో ఇల్లీగల్ నిర్మాణాలు నేను చూపిస్తా అన్నారు. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుందన్నారు. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలని కోరారు. ఢిల్లీలో కురిసిన వానలకు పాత రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ ఒక్కసారిగా నీటితో నిండిపోయి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటన తెలిసిందే..
Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..

Exit mobile version