NTV Telugu Site icon

Telangana Projects: తెలంగాణలో కురుస్తున్న వానలు.. ప్రాజెక్టులకు వరద నీరు..

Telangan Projucts

Telangan Projucts

Telangana Projects: నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి నీటి విడుదల చేసారు ప్రాజెక్టు అధికారులు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని విడుదల చేశారు అధికారులు. 5 వేల క్యూసెక్కుల నీటిని, నాలుగు రోజుల పాటు.. మొత్తం 1.5 టీఎంసీల నీటిని ఎడమ కాలవ ద్వారా విడుదల చేయనున్నారు ప్రాజెక్ట్ అధికారులు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో… ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటిమట్టం 505 అడుగులకు చేరుకుంది.. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ నుండి ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నారు.

Read also: JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని ఏపీ నుంచి బహిష్కరించాలి..!

ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షం. సింగరేణి బాంబు బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇల్లు, కురుస్తున్న వర్షాలకు కిష్టారం గ్రామంలో రాములు అనే వ్యక్తి ఇల్లు నేలకూలింది. అర్దరాత్రి సమయంలో గొడలు వర్షానికి నాని కూలటంతో అలికిడికి బయటికి వచ్చి కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరోవైపు కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి ఉదృతంగా ప్రవహిస్తున్న దిందా వాగు, పలు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది.
* ప్రాజెక్టు కు 20914 క్యూసెక్కుల ఇన్ ఫ్లో…
* ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ ప్రస్తుతం 1065.10 అడుగులు ,
* పూర్తిస్థాయి సామర్థ్యం 80టీఎంసీ లు కాగ ప్రస్తుతం 16.125టీఎంసీ ల నీరు నిల్వ ఉంది….

మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద..
* ఇన్ ఫ్లో : 35,000 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో : 32,514 క్యూసెక్కులు
* పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు
* ప్రస్తుత నీటి సామర్థ్యం: 315.970 మీటర్లు
* పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 TMC
* ప్రస్తుత నీటి నిల్వ : 5.134 TMC ఇక ఎగువ,దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read also: JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని ఏపీ నుంచి బహిష్కరించాలి..!

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతున్న వరద ప్రవాహం..* కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు,7.603 టీఎంసీలు.
* ప్రస్తుత నీటిమట్టం 688.450 అడుగులు, 4.951 టిఎంసిలు.
* ఇన్ ఫ్లో గా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 4082 క్యూసెక్కుల వరద నీరు

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మంచిర్యాల జిల్లా దేవులవాడ లో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది.
* కోటపల్లి మండలం దేవుల వాడ లో 143 మీ మీ వర్షపాతం నమోదు.
* నిర్మల్ జిల్లా పెంబి లో 73.3 మీ మీ వర్షపాతం నమోదు.

జయశంకర్ భుపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వర్షం కారణంగా భుపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్2,3 గనుల్లో రోడ్లన్నీ బురద మయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయయం ఏర్పడగా సింగరేణి సంస్థ కు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి పోటెత్తిన వరద.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బ్యారేజ్ లో పూర్తిగా 85 గేట్లు ఎత్తి‌,దిగువకు నీటి విడుదల.
* ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 1,93,550 క్యూసెక్కులు.

Read also: Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు వానలు నమోదయ్యాయి.

* సిద్దిపేట జిల్లా చీకోడులో అత్యధికంగా 8.2 సెం.మీ వర్షం, ములుగులో 4.3 సెం.మీ వర్షం
* మెదక్ జిల్లా శివునూరులో 4.8 సెం. మీ, శివ్వంపేటలో 4.8 సెం. మీ వర్షపాతం నమోదు
* సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ లో 4.1 సెం. మీ, పటాన్ చెరులో 3.5 సెం. మీ వర్షపాతం నమోదు

ఆల్మట్టి అప్ డేట్…

* ఇన్ ఫ్లో : 43,478 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో : 65,480 క్యూసెక్కులు
* పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 519.60 మీటర్లు
* ప్రస్తుత నీటి సామర్థ్యం: 517.98 మీటర్లు
* పూర్తిస్థాయి నీటి నిల్వ: 123.081 TMC
* ప్రస్తుత నీటి నిల్వ : 97.416 TMC

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు. రోజుకి 3 వేల క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు ఒక టీఎంసీ నీటి విడుదల చేశారు. దీంతో 590 అడుగుల పూర్తి స్థాయికి…ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 505 అడుగులు కాగా.. సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 15 వేల క్యూసెక్కులు.

నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్ట్ అప్డేట్..

* ఇన్ ఫ్లో :560.29 క్యూసెక్కులు.
* అవుట్ ఫ్లో : 62.19 క్యూసెక్కులు.
* పూర్తి స్థాయి నీటి మట్టం: 645.00.అడుగులు..
* ప్రస్తుతo: 638.70 అడుగులు.
* పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 4.46 TMCలు.
* ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 2.93 TMC లు.
Infosys : 52 వారాల గరిష్టానికి ఇన్ఫోసిస్ షేర్లు..మూడు నెలల్లో రూ.6368 కోట్లు ఆర్జించిన కంపెనీ

Show comments