Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో ఇవాళ ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. భారీగా వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, అమీర్ పేట్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, ఖాజాగూడ, మెహిందీపట్నం, ఎస్ ఆర్ నగర్, దిల్ షుక్ నగర్, మలక్ పేట్, చాదర్ ఘాట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఈనేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్ష ప్రభావం ఇంకా మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
Read also: Big Breaking: ఉపాధ్యాయులకు ఊహించని షాక్.. డీఎస్సీ కౌన్సెలింగ్‌ను వాయిదా..
అంతే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (బుధవారం) ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరికలు జారీ చేశారు.
Read also: Prajavani Program: నేడు గాంధీ భవన్ లో ప్రజావాణి.. ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి సీతక్క
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. నగరంలోని బాలానగర్, ఖైరతాబాద్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, ప్రగతినగర్, పటాన్ చెరు, మేడ్చల్, దుండిగల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, గుండ్ల పోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఫ్లైఓవర్ పై వాహనాల పార్కింగ్