Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా నియో గో ట్రావెల్స్ బస్సు (AP 39 UP 1963) ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి సర్వీస్ రోడ్డుపై నుంచి కిందకు దిగుతుండగా బోల్తా పడింది. అయితే, పఠాన్‌చెరువు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి, పెద్ద అంబర్‌పేట్ వద్ద కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, ఔటర్ రింగ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
- హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
- పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు..
- మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం

Hyd