President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి
- లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది..
- నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు
- లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu: లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది. నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9.30కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు. లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. నిన్న లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు శిల్పారామంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోక్‌మంథన్ నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది నాల్గవ లోకమంతన్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రజ్ఞా ప్రవాహ అనే సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విదేశీ కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్ మంథన్ వేడుకలో గిరిజన హస్తకళల, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలు తమ నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం కూడా ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 1500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ఉపకరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Read also: Tollywood Movies : క్రిస్మస్ జాతర.. ముగ్గురిలో విజేత ఎవరవుతారు ?
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్ భవన్ కుడివైపు వీవీ విగ్రహం, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్‌కృష్ణ, ఎన్ఎఫ్సీఈఎల్ ఎస్ఎల్టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం-65, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ- ఎన్ఎఫ్సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజా భవన్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడిచారు.
VishwakSen : మెకానిక్ రాకీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!