మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నేడు అనగా 22న విడుదల కానుండగా గత రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు.
అలాగే నేడు ఓవర్సీస్ లోను ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ ముగిసాయి. పబ్లిసిటీ కార్యక్రమాలు పీక్స్ లో నిర్వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే మొదటి భాగం కథ ఎటూ కథల కుండా అక్కడక్కడా కొన్ని జోకులు మినహా, అంత ఆసక్తికరంగా ఏమీ లేదు మరియు కొన్నిసార్లు చికాకు కలిగిస్తుంది. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే రోటీన్ గా ఉంది . ఇక చాలు అనుకున్న టైమ్ కు ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లోనే సినిమా అంతా ఉంది. కథ,కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ కి ఓపిక నశించిన ప్రేక్షకుడుకి సెకండ్ హాఫ్ బిగ్ రిలీఫ్ ఇస్తుంది. మొత్తంగా చూస్తే మెకానిక్ రాకి ఫస్ట్ హాఫ్ చూసే ఓపిక ఉంటె సెకండ్ హాఫ్ మెప్పిస్తు సాగే సాదాసీదా సినిమాగా ముగుస్తుంది. విశ్వక్ సేన్ ఎప్పటిలాగా అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాధ్ మెప్పించారు. ఓవరాల్ గా కామెడీ, సెకండ్ హాఫ్ కోసం ఓ సారి చూసేయచ్చు.