President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరుకానున్నారు. కాగా.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉంటారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేస్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, ఏర్పాట్లను పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు.
Tirupati Laddu Controversy: లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్ బృందం..