Praja Bhavan: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య తెలిపారు. నేడు ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున ఇవాళ నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు ఆమె తెలిపారు. ఈ మార్పును అనుసరించి అర్జీదారులు బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిని మంగళవారానికి బదులు బుధవారానికి మార్చినట్లు, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించగలరని అన్నారు.
అంతేకాకుండా.. హైదారబాద్, రాష్ట్రంలోని జిల్లాలోని అర్జీదారులు ప్రజావాణి మార్పును గమనించాలని కోరారు. అర్జీదారులు ప్రజాభవన్ వద్దకు ఇవాళ రావద్దని కోరారు. వచ్చి మళ్లీ ఇబ్బందులకు గురి కావద్దని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు రేపు (బుధవారం) ప్రజాభవన్ కు అర్జీలతో రావాలని కోరారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పలు శాఖలపై దాడులు కూడా జరిగాయి. అయితే.. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిణిగా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
Vinayaka Nimajjanam: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ..