NTV Telugu Site icon

New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్‌, ఆరోగ్య కార్డులు..

Tg Ration Health Cards

Tg Ration Health Cards

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపరిపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో 10 రోజుల పాటు ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్‌కార్డు, హెల్త్‌కార్డు వివరాల సేకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి పూర్తి ఆరోగ్య ప్రొఫైల్‌తో హెల్త్‌కార్డులు ఇవ్వబోతున్నామని వివరించారు. కాగా, రేషన్‌కార్డులు, ఆర్యోగశ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులైన వారిని గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని కూడా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి రేషన్‌కార్డులకు సంబంధించిన హెల్త్‌కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..

దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే.. తెలంగాణలో 9 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు.. ఈ క్రమంలో.. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, కుటుంబాలు పెంచుకుంటున్నారు, పిల్లల సంఖ్య పెరుగుతోంది.. మార్పులు కొత్త రేషన్‌కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం చేస్తోంది. ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది… కాగా.. గతేడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐదు హామీలకు సంబంధించి మొత్తం 1కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ జనవరి 12తో పూర్తయింది.ఈ క్రమంలో మరోసారి ప్రజాపరిపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల దరఖాస్తులను స్వీకరించేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
OYO : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్.. ఆపై బ్లాయ్ మెయిల్

Show comments