NTV Telugu Site icon

Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?

Group 2 Postpon

Group 2 Postpon

Group-2 Postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..

గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులను 2000కు, గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపికై 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. దీనిపై నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా.. ఈ రెండింటినీ బ్యాక్ టూ బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకపై సీఎం దృష్టి సారించారు.

ఇదే అంశంపై సీఎం కూడా సమావేశంలో చర్చించారు. పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా పడుతుందా? లేక డీఎస్సీ? వాయిదా పడుతుందా అనే ప్రశ్నలపై నేడు టెన్షన్‌ వీడిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఇవాళ సీఎం రేవంత్ సమీక్షలో గ్రూప్‌-2 వాయిదా వేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్-2 వాయిదా వేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థలకు ఇది శుభవార్తే అని చెప్పాలి.
GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు..

Show comments