Site icon NTV Telugu

KTR: కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

Ktr House

Ktr House

KTR: మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. గ్రౌప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ కలుస్తారనే విశ్వనీయ సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల పక్షాన విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతోంది.. దీనిపై రాజకీయ నిరసనలు వెల్లువెత్తడంతో పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, దుబ్బాక ఎమ్మెల్యే కోట ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఇళ్ల బయట పహారా కాస్తున్నారు.
Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు

Exit mobile version