నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బండిసంజయ్. పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గ్రూప్1 అభ్యర్థులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు.…