NTV Telugu Site icon

Hyderabad Police: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌.. పబ్‌లు, బార్‌లపై పోలీసుల ఫోకస్‌..

Madhapur Police

Madhapur Police

Hyderabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని తనిఖీలను నిర్వహించారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.

Read also: Astrology: డిసెంబర్ 29, ఆదివారం దినఫలాలు

అనుమతులు ఎంత వరకు ఉన్నాయన్న దానిపై పోలీసులు ద్రుష్టి పెట్టారు. బార్లు, పబ్ లలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగ తనిఖీలు చేపట్టారు. మైనర్‌లకు ఎట్టి పరిస్థితి లో బార్లకు, పబ్ లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సౌండ్ పొల్యూషన్‌తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలను పబ్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని పబ్ యజమానులకు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితిలలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలను అనుమతించిన కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.
South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

Show comments