NTV Telugu Site icon

Hyderabad: మూసీ నదిలోకి కెమికల్స్ డంపింగ్.. పోలీసులు అదుపులో నిందితుడు

Musi

Musi

Hyderabad: కెమికల్, ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి రెండు ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం.

Read Also: IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. ఏ జట్టులో ఎవరెవరున్నారో తెలుసా?

అయితే, మూసీ కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్ బయల్దేరిన తర్వాత.. ప్రతీ పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ దగ్గర ట్యాంకర్ ను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్, కంపెనీల ఏజెంట్లు.. డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇసుక రిచ్ నిర్వహకుడితో కలిసి తతంగం కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు.. వెనక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా.. మరో ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీలు పెద్ద మాఫియా నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు.