NTV Telugu Site icon

లాక్‌డౌన్‌ సడలింపులపై గందరగోళంలో ప్రజలు..

lockdown

lockdown

లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్‌డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో గందరగోళానికి గురైన ప్రజలు… ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు.. గురువారం నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ఇళ్లకు చేరుకోవడానికి అదనంగా మరో గంటతో సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉంటాయి.. కానీ, అది ఈరోజు నుంచే అనే భ్రమలో ఉన్న ప్రజలు.. ఈ విషయాన్ని గమనించక అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు.. దీనిపై ప్రజలకు అవగాహాన‌‌ కల్పించాలని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు ఉన్నతాధికారులు.