NTV Telugu Site icon

Air Hostess: ఎయిర్‌ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..

Indigo

Indigo

Air Hostess: విమానాల్లో ప్రయాణీకులు, విమాన సిబ్బంది, పైలట్ల ప్రవర్తన ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విమానాల్లో సీట్లపై ఉన్న ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికులు, సిబ్బందిపై కొందరు అనుచితంగా ప్రవర్తించడం అసహ్యం కలిగిస్తోంది. కాగా, మాలి నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌ని లైంగికంగా వేధించడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే ఇవాళ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇండిగో విమానంలో ఎయిర్‌ హోస్టెస్‌ పట్ల ఓ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన ఎయిర్ హోస్టెస్‌ విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రయాణికుడ్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి నరసింహులుగా గుర్తించారు. నరసింహుల్ని ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆమె పట్ల అసభ్య ప్రవర్తన చేసినందుకు కేసు నమోదు చేశారు. ప్రయాణికుడు మద్యం మత్తులో వున్నాడా? లేక ఎయిర్‌ హోస్టెస్‌ పట్ల అసభ్యంగా ఎందుకు ప్రవర్తించాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
Pushpa 2 : అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యవ్వ తగ్గేదేలే