NTV Telugu Site icon

Hyderabad: వాల్టా చట్టానికి అధికారులు పదును.. చెట్టు నరికితే భారీ జరిమానాలు..

Valta Chattam

Valta Chattam

Hyderabad: హైదరాబాద్‌ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్‌ పెట్టింది. ప్రతి చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. చెట్టును నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్కులో మొక్కను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కేబీఆర్‌ నేషనల్‌ పార్క్‌కు సంబంధించి ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు ఇలాంటి ఫిర్యాదులతో పలు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ డివిజన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. ఆ చెట్టు వల్ల ఏదైనా సమస్య ఉంటే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలించి, నిజంగా సమస్య ఉంటే, చెట్టును నరికి లేదా స్థలం నుండి తొలగించి మరెక్కడా నాటుతారు. చెట్టును తొలగించేందుకు రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేకపోతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా వేలల్లో ఉంటుంది.

Read also: South Central Railway: తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం..

కానీ చాలా మందికి వాల్టా చట్టంపై సరైన అవగాహన లేదు. దీంతో కొందరు తమ ఇళ్లలో చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.32లో నివాసముంటున్న సమ్మిరెడ్డి తన ఇంటి ముందున్న మూడు చెట్లను కరెంటు తీగలు అడ్డుగా ఉన్నాయని నరికాడు. అతనికి అధికారులు జరిమానా విధించారు. కానీ అలాంటి చట్టం ఉందని తనకు తెలియదనే చెట్లను నరికివేసినట్లు సమ్మిరెడ్డి అధికారులకు తెలిపారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 76లో నివాసముంటున్న ప్రసాద్‌ ఇంట్లోని సీతాఫలం చెట్లను నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.12వేలు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ వ్యాపారి తన ఇంటి ఆవరణోని చెట్టు కొమ్మను నరికేయడంతో రూ.10వేల జరిమానా కట్టాడు. గతేడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో నివాసముంటున్న హేమలత ఇంటి పక్కన చెట్టును నరికితే రూ.12 వేలు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. ఈ చట్టం చెట్లు, మొక్కలకే కాకుండా భూమి, నీటికి కూడా వర్తిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..