KTR: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటే గౌరవం ఉంది.. కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇక, ఓటుకు నోటు దొంగ సీఎం అని అనలేదు.. జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు 30 శాతం అని.. అలాగే, పీసీసీ పదవిని 50 కోట్ల రూపాయలకు కొన్నాడు అని కోమటిరెడ్డి అన్నారు.. ఇవన్నీ నేను అన్న మాటలు కావు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలే చెప్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..
ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేటీఆర్ కి సభలో నిరసన తెలిపే హక్కు ఉంది.. అయినా లాబీలో షో చేశారు.. అసెంబ్లీ లాబీల్లో సభ నడుస్తున్నప్పుడు ఫోటో, వీడియో తీయొద్దు.. తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేశారు. ఇలా అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం మంచి సంప్రదాయం కాదు.. బీఆర్ఎస్ నేతలు నిరసన చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు అని ఆది శ్రీనివాస్ తెలిపారు.