Site icon NTV Telugu

Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేనట్లే..!

Clg

Clg

Telangana: ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం తీసుకుంది. గతంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును స్టడీ చేయాలని AFRC ప్లాన్ చేస్తుంది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరవాతే ఫీజుల పెంపుపై సహేతుకంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక, అధ్యయనం చేసి ఫీజులు ఖరారు చేసేందుకు టైమ్ పడుతుంది.. ఆగస్టు 14వ తేదీలోపు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యం లో.. పాత ఫీజులతోనే ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

Read Also: Shashi Tharoor: ‘‘బిన్ లాడెన్‌ను మర్చిపోయారా.?’’ ఆసిమ్ మునీర్‌లో లంచ్‌పై విమర్శలు..

అయితే, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల నిర్ధారణ హేతుబద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్నా ఫీజులను కొనసాగించాలని పేర్కొనింది. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా ఉన్నాయో అనే దానిపై సర్కార్ అధ్యయనం చేయనుంది. ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపనుంది. అక్కడ ఫీజుల నిర్ధారణ ఎక్స్ పర్ట్ టీమ్స్ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించనున్నాయి. కమిటీల రిపోర్ట్ తరవాత గైడ్ లైన్స్ ను ప్రభుత్వం రూపొందించనుంది. ఫీజుల పెంపు క్రైటీరియా, పద్ధతులను ఫైనల్ చేసి అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీకి సమర్పించే అవకాశం ఉంది. AFRC గైడ్ లైన్స్ లో మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. AFRC కూడా ఫీల్డ్ విజిట్ చేసే విధంగా నిబంధనలు మార్చనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఫీజుల నిర్ధారణ జరిగే వరకు ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఫీజుల పెంపు లేకపోతే కొన్ని కాలేజీలు కోర్టు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Read Also: UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు..

ఇక, ఫీజుల నిర్ధారణ హేతుబద్ధంగా జరగడం లేదని ప్రభుత్వం వాదిస్తుంది. ఆమోదయోగ్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండడం లేదని పేర్కొనింది. కొన్ని కాలేజీల్లో 90 శాతం ఫీజు పెంచారు.. ఖర్చు ఎంత అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.. లాభాపేక్ష లేకుండా విద్యను అందించాలి.. 10 శాతం వరకు లాభం ఒకే అని తెలిపింది. కొన్ని కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ కోసం10 లక్షలు ఖర్చు పెట్టాయి.. యాడ్స్ కు విద్యార్థులకు ఏమీ సంబంధం అని ప్రశ్నించింది. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కొన్ని కాలేజీలు నడుస్తున్నాయని తెలిపింది. కొన్ని కాలేజీల్లో 80 శాతం విద్యార్థులు ప్రభుత్వ ఫీజుల మీదనే చదువుతున్నారు.. AFRC ఫీల్డ్ విజిట్ చేయకుండానే ఫీజుల నిర్ధారణ చేయడం కరెక్ట్ కాదు అని వాదిస్తుంది. వసతులు లేవు, ఫ్యాకల్టీ లేదు.. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు కూడా లేరు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏది పరిగణనలోకి తీసుకోకుండా కాలేజీలు ఇచ్చే ఆడిట్ రిపోర్టుల పైనే ఫీజుల పెంపు ఎలా అంగీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version