Heavy Vehicles: హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఏదైనా భారీ వాహనం వెళ్తే.. వెనుక ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతం. అవి నెమ్మదిగా కదులుతున్నాయి. దారి ఇవ్వకుండా మార్గమధ్యం నుంచి వెళ్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాల నివారణకు నగరంలోకి పలు వాహనాల రాకపోకలను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిదానంగా వెళ్లే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సామాన్య ప్రయాణికులు ఈ వాహనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వాహనాలపై నిషేధం విధించారు. భారీ వాహనాలు, వ్యాన్లు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులపై ఆంక్షలు విధించారు.
Read also: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
భారీ వాహనదారులు ట్రాఫిక్ నియమాలు యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకు ఈ ఏడాది జనవరిలో భారీ వాహనాల రాకపోకల సమయాలను నిర్దేశించారు. అయినా పోలీసుల నిబంధనలను పట్టించుకోకుండా భారీ వాహనాలు సిటీలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. లోకల్ లారీలు , భారీ వాహనాలకు ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి ఎంట్రీ లేదని పోలీసులు నిబంధనలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సులకు ఉదయం 8 గంటల తర్వాత సిటీలో ఎంట్రీ కి అనుమతి లేదని వెల్లడించారు. హైదరాబాదులో 94 రూట్లలో ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. కేటాయించిన సమయానికి మించి భారీ వాహనాలు రోడ్లమీద తిరుగుతున్నాయని దాని పరిణామాలు హబ్సిగూడ లో రెండు రోజుల క్రితం లారీ ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి కారణమని పోలీసులు తెలిపారు.
Read also:Abhishek Singhvi: నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్..
భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు ఉదయం 7 గంటల తరువాత సిటీలో రావడం వల్లను ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతున్నాయని, అలాగే ప్రమాదాలకు గురి అవుతున్నాయని వెల్లడించారు. నగరంలోకి వెళ్లాలంటే రాత్రి 12 గంటల తర్వాతే నగరంలోకి ప్రవేశించాలి. నగరంలోకి భారీ వాహనాలు, భారీ వాహనాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సామాగ్రిని తరలించే స్థానిక వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులను నగరంలోకి అనుమతించరు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Tarnaka Petrol Bunk:పెట్రోల్ కు బదులుగా నీళ్లు.. వినియోగదారులు అందోళన
