NTV Telugu Site icon

Nara Rammurthy Naidu: చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్‌..

Nara Rammurthy Naidu

Nara Rammurthy Naidu

Nara Rammurthy Naidu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట రామ్మూర్తి నాయుడు.. అయితే, తన చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని.. అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరారు.. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కొనసాగుతున్నాయి.. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. అయితే, చిన్నాన్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలియగానే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు మంత్రి నారా లోకేష్..

Read Also: Road Accidents: భారత్‌లో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాలు, 20 మంది మృతి.. అధ్యయనంలో వెల్లడి

కాగా, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు.. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1999 వరకు ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత ఆయన క్రమంగా రాజకీయాలకు దూరం అయ్యారు.. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు నటుడు రోహిత్‌ కాగా.. మరో కుమారుడు నారా గిరీష్…

Show comments