Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్‌లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు. అయితే, ఈ కేసును విచారించిన సీఐడీ అధికారులు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులతో పాటు, నకిలీ సేల్ డీడ్ పత్రాలు, GPA పత్రాలు, తాకట్టు పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు వంటి 60 పత్రాలను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.
Read Also: Naari Naari Naduma Murari : పెద్ద సినిమాల నడుమ శర్వా సినిమా.. అయ్యే పనేనా?
ఇక, ఇరువురి తరపున వాదనలు పూర్తైన అనంతరం, నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, 2007లో SBH ఎయిర్ కార్గో బ్రాంచ్ నుంచి మోసపూరితంగా రూ.24 లక్షల హౌసింగ్ లోన్‌ను నిందితులు పొందారు. నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ సంతకాలు, నకిలీ ‘సేల్ అగ్రిమెంట్’ పత్రాలు సమర్పించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అలాగే, SBIతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కెనరా బ్యాంకులను కూడా ఈ దంపతులు మోసం చేసినట్లు విచారణలో తేలింది.
