Site icon NTV Telugu

MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దు..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పంచామృతంతో తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులతో రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దని హెచ్చారించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదన్నారు. ఉద్యమ కారులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీ గురువు చంద్రబాబును అడుగు అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి తెలంగాణ జాతరలు, ఆడబిడ్డల పేర్లు తీయలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం పెట్టారని కవిత మండిపడ్డారు.

Read also: Manchu Family : మంచు మనోజ్‌ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు

టీజీ అని ఉద్యమంలో పచ్చబొట్టు కొట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీజీని గుర్తించిన రేవంత్ ఉద్యమకారులంతా కలిసి తయారు చేసుకున్న విగ్రహం ఎందుకు మార్చారని తెలిపారు. ప్రపంచంలో అందరూ పూలతో దేవుని పూజిస్తే తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. యూనిక్ ఐడెంటిటీ గా ఉన్న బతుకమ్మను మాయం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ నీ మాయం చేసి కాంగ్రెస్ గుర్తు పెట్టారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలకు విగ్రహాలు… పురుషులకు వరాలు ఇస్తున్నారని తెలిపారు. బీద తల్లిని పెట్టారు… తెలంగాణ మహిళలు ఎదగటం ఇష్టం లేదా? తల్లి గొప్పగా ఉండాలి… కానీ మీరు కాంగ్రెస్ తల్లి నీ పెట్టుకున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Sangareddy: మంజీరా నదిలో మొసలి కలకలం.. భయాందోళనలో మత్స్యకారులు, స్థానికులు

రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందన్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటకలో పండించరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మకు కాంగ్రెస్ హస్తం గుర్తు పెట్టి ఇదే తెలంగాణ తల్లి అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కారులకు నజరానా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. మహిళలకు విగ్రహాలు పెట్టి పురుషులకు వరాలు ఇస్తున్నారన్నారు. బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సంధ్య, విమలక్క, ఇతర తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏది? అని సీఎంను ప్రశ్నించారు.

Read also: Legally Veer : రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’

నిన్న ఆశా వర్కర్ల మీద ప్రభుత్వం చేసిన దాష్టికాన్ని ఖండిస్తున్నామన్నారు. వారికి మా పూర్తి మద్దత్తునిస్తున్నామని తెలిపారు. ఒకవైపు మహిళల పేదలుగా చూడాలనుకుంటున్న రేవంత్.. మరోవైపు మహిళలపై దాడులు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్నారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారని కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు.
Rangareddy: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు.. లోనికి అనుమతించని స్కూల్‌ యాజమాన్యం

Exit mobile version