MLC Kavitha: నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
- కవితపై సీబీఐ చార్జిషీట్ దాఖలు..
- నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు పరిశీలన అంశంపై ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగనుంది. కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది.మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read also: Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
అయితే.. ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసినా, విచారణ పూర్తయితే.. దర్యాప్తు సంస్థలు కోర్టును మరికొంత సమయం కోరుతాయి. దీంతో కోర్టు కస్టడీని పొడిగిస్తూనే ఉంది. మరణశిక్ష, జీవిత ఖైదు లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే కేసుల్లో కస్టడీ వ్యవధి గరిష్టంగా 90 రోజులు ఉంటుంది. ఇతర కేసుల విషయంలో గరిష్ట విచారణ సమయం 60 రోజులు. డిఫాల్ట్ బెయిల్ అనేది ఈ గడువు ముగిసినా కేసు విచారణ పూర్తికాకపోతే బెయిల్ పొందడం నిందితుడికి చట్టపరమైన హక్కు. కవిత కేసు గడువు ముగియడంతో, ఆమె తరపున న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Telangana Govt: కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ జయంతి కానుక.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!