నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మునిసిపాలిటీగా మారి అభివృద్ధిపథంలో నడుస్తోందని ఆయన అన్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలుకావడం లేదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దంటూ ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.
