NTV Telugu Site icon

Minister Srinivas Goud: మా వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టం

Srinivas Goud

Srinivas Goud

తెలంగాణ వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ వేడకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, ఇతర ముఖ్యనేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వీరత్వంలో శివాజీకి ఏ మాత్రం తీసిపోని సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు ఛైర్మన్ లు, నేతలు హాజరయ్యారు.

Read Also: Araria Journalist : జర్నలిస్ట్ దారుణ హత్య.. విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో సర్వాయి పాపన్న వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించాలి అంటే అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. మరోవైపు బీసీలు ఎదుగుతుంటే అణిచి వేసే కుట్రలు ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉన్న ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Read Also: Kiara Advani : నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తమ వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అంతేకాకుండా.. తమ జాతులను కించ పరిచే విధంగా మాట్లాడితే రాజకీయంగా అణగతొక్కుతామని శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.