Kiara Advani : నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది.ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయి లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క నటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే కెరియర్ పరంగా ఇతరులతో తాను పోటీ గురించి అస్సలు పట్టించుకోనని ఆమె తెలియజేశారు. నటన విషయంలో నాకు నేనే పోటీగా ఉంటానని ఆమె తెలిపారు. నటన పరంగా నాలో గతంలో కంటే ఇప్పుడు ఎంతవరకు మార్పు వచ్చిందనేదే నాకు ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఈ విధంగా నాతో నేనే పోటీ పడుతూ మంచి నటిగా పరివర్తన చెందుతున్నానని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం కీయారా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!