IT Minister Sridhar Babu: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదె అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే అన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని క్లారటీ ఇచ్చారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. లగచర్ల ఘటనలో.. కలెక్టర్,గ్రూప్ 1 అధికారిని చంపే ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎవ్వరినీ తప్పుపట్టం… విచారణ జరుగుతుందన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ – బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియ జరుగుతోందన్నారు.
Read also: CM Chandrababu: నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయి: సీఎం
ఏదో ఒక కేసులో తనను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. లగచర్ల ఘటన రాజకీయ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా కేటీఆర్ పాత్రపై నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహం రచించారని, మిగిలిన నిందితులను రెచ్చగొట్టేందుకు తన అనుచరుడు బొమ్మమోని సురేష్ ను ఉపయోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల తండా, లగచర్ల గ్రామాలకు చెందిన రైతులు సురేష్ సహకారంతో రెచ్చిపోయారని, ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు గ్రామస్తులకు అండగా ఉంటారని నివేదికలో పేర్కొన్నారు.
Ashu Reddy : అషూ రెడ్డి అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే.. హీటెక్కించేస్తోంది