NTV Telugu Site icon

D. Sridhar Babu: తెలంగాణ ప్రజలకు ఐటీ మంత్రి విజ్ఞప్తి.. ఏమన్నారంటే..

D. Sridhar Babu

D. Sridhar Babu

D. Sridhar Babu: మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు. పోలీస్, ఫైర్, హెల్త్, GHMC కి సంభందించిన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనదన్నారు. వివిధ ఉత్సవ కమిటీ కి సంభంధించిన నిర్వాహకులు ఈ సమావేశం లో పాల్గొన్నారని తెలిపారు. వారు గతం లో ఎదురుకున్నా చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ , కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.

Read also: Bomma Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు తోనే కవితకు బెయిల్..

అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. అందరు కూడా సహకరించి ముందుకు వెళతామని వారు తెలియజేశారన్నారు. పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అదేశించామన్నారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారు..

Show comments