Minister Seethakka: బతుకమ్మ చీరలకు మించి ప్రయోజనాలు కల్పిస్తున్నాం.. హరీష్ రావుకు సీతక్క కౌంటర్
- ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలు..
- హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క..
- బతుకమ్మ చీరలకు మించిన ఆర్దిక ప్రయోజనాలను మహిళలకు కల్పిస్తున్నామని కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను పంచాయతీ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క ఖండించారు. ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. నాసి రకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్నిబీఆర్ఎస్ కించపరిచిందన్నారు. బతుకమ్మ చీరలకు మించిన ఆర్దిక ప్రయోజనాలను మహిళలకు కల్పిస్తున్నామన్నారు. బతుకమ్మ చీరలకు గత ప్రభుత్వం ఏడాదికి చేసిన ఖర్చు రూ.300 కోట్లు మాత్రమే అన్నారు. మహిళలకు ఆర్దిక స్వేచ్చ కల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పరుస్తున్నామని తెలిపారు. మహిళకు ప్రయాణ బారం లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు. నిన్నటి దాకా 98.50 కోట్ల ఉచిత ప్రయాణాలను అక్కచెల్లెమ్మలు వినియోగించుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణం విలువ అక్షరాల రూ. 3,325 కోట్లు అని స్పష్టం చేశారు.
Read also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టిక్కెట్ల దందా.. ఈడీ దర్యాప్తు ముమ్మరం..
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
అంటే సగటున నెలకు రూ. 332 కోట్లు ఆడబిడ్డలకు ఆదా అవుతోందని అన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం వెచ్చించిన బడ్జెట్ కు పదిరెట్లు అధికంగా ఉచిత బస్సు ప్రయాణం కోసం మా ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఒక్క ఏడాది కోసం బతుకమ్మ చీరల ఖర్చు రూ. 300 కోట్లు అని.. అదే ఒక్క నెల ఉచిత బస్సు ప్రయాణం ఖర్చు రూ.332 కోట్లని స్పష్టం చేశారు. మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అన్నారు. అదే బీఆర్ఎస్ హయంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1200 అన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కింద వేయి కోట్లు వెచ్చించామని తెలిపారు. మహిళా సంఘాల ఆర్దిక స్వావలంబన కోసం బ్యాంకులకు రూ.400 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. మరో వేయి కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతూ వారిని ఆర్దికంగా బలోపేతం చేసేందుకు చేయూత నిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను సరిదిద్దుతూ ఎన్నికల హమీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని తెలిపారు.
KTR Viral Tweet: పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!