NTV Telugu Site icon

Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు (బుధ, శుక్రవారాలు) జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.

Read also: President Droupadi Murmu: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Read also: Konda Surekha: అటవీశాఖ సిబ్బంది పై దాడి ఘటన.. చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ ఆదేశం..

నా నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారన్నారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదని తెలిపారు. వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలన్నారు. వాటిపై విస్తృత సమాచారం అందించాలని తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలని మంత్రి తెలిపారు.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌