Komatireddy Vs Harish: అసెంబ్లీలో కోమటిరెడ్డి – హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం..
- కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు - హరీష్ రావు..
- హరీష్ రావు వద్ద సబ్జెక్ట్ లేదు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Vs Harish: అసెంబ్లీలో మాటల యుద్దం కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా? అన్నారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలన్నారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారన్నారు. దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలన్నారు. గృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. యువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదని తెలిపారు. చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదన్నారు.
Read also: Harish Vs Revanth: పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్.. రేవంత్ రెడ్డి కౌంటర్..
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
హరీష్ రావు మాటలకు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని అన్నారు. అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్సే అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు. దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.. ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడన్నారు. గతంలో హరీష్ రావు ఒక డమ్మీ మంత్రి అన్నారు. కేసీఆర్ సభుకు రాలేక హరీష్ రావును పంపారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
Harish Rao vs Bhatti Vikramarka: నేను ఒప్పుకున్నానా..? హరీష్ పై భట్టి ఫైర్
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!