Kishan Reddy: తెలంగాణలో మూసీ సుందరీ కరణ హాట్ టాపిక్ గా మారింది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చి వేస్తుందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం న్యాయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణను, పునరుజ్జీవన చర్యలను మేం వ్యతిరేకించడం లేదని కానీ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూసీ సుందరీకరణ చేయాలని కోరారు. మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, అభివృద్ధి చేయాలని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో గత 30-40 సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయవద్దని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధి నగర్ డివిజన్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సేవరేజ్ లైన్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా అనేక ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లలో మురుగు నీరు కలవడంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారు. వర్షాకాలంలో నీట మునిగి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ అవసరమని తెలిపారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకుండా, అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ మూసీ సుందరీకరణ చేయడం వీలుకాదు. దాంతోపాటు ఇతర అభివృద్ధి పనులు ముందుకు వెళ్లలేవన్నారు. తెలంగాణ నుంచి 30 శాతం జనాభా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం నిధుల కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Read also: Harish Rao: రేపు గన్ మెన్లు లేకుండా రా నేనే కారు నడుపుతా.. సీఎంకు హరీష్ రావు సవాల్..
జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు అరకొర నిధులు మాత్రమే విడుదల చేయడంతో హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. నగరంలో పౌర సౌకర్యాలు కల్పించేలా జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ కు నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలే కాదనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. సనత్ నగర్, ఖైరతాబాద్, గౌలిపుర వంటి అనేక ప్రాంతాల్లో రోడ్ల గుంతలను పూడ్చడంతో పాటు డ్రైనేజీ సిస్టమ్ ను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో సుమారు రూ. 50 లక్షల నిధులతో హరిత అపార్ట్మెంట్ లైన్, వాల్మీకి నగర్ వంటి ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ కు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేలా ఈరోజు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేలా, అండర్ గ్రౌండ్ పైపులైన్లను మెరుగుపర్చేలా శాశ్వత ప్రాతిపదకన పరిష్కారం చూపేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు.
OG Movie : ఓజీ.. ఆన్ షూటింగ్.. వైరల్ అవుతున్న ఫోటోస్