తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు.
జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులపై పెనుభారం మోపేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని, ఎరువులపై పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
