Site icon NTV Telugu

Adluri Lakshman: కవిత ఆరోపణలకు సమధానమేది?.. హరీశ్‌రావుపై మంత్రి లక్ష్మణ్ ఆగ్రహం

Adluri Lakshman

Adluri Lakshman

మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కవిత చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మీ కుటుంబంలో గొడవలు పెట్టుకుని.. మంత్రివర్గాన్ని విమర్శించడమేంటి? మేమే రాజులం.. మేమే మంత్రులం అన్నట్లుగా పరిపాలన చేశారు. పదేళ్లు పాలించిన హరీశ్‌రావు.. రాష్ట్ర కేబినెట్‌లో పంపకాల గురించి మాట్లాడుకున్నారంటూ మాట్లాడతారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా? అబద్ధాలు పదిసార్లు చెప్పి నిజం అని నమ్మించే పనిలో హరీశ్‌రావు ఉన్నారు.’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: K. Laxman: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉంది

కేబినెట్ మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ‘‘దండుపాళ్యం అని మమ్మల్ని అంటున్నావు.. పదేళ్లు మీరు స్టువర్టుపురం దొంగల్లా పంచుకున్నారా..?, పదేళ్లు మీ కేబినెట్‌లో అసలు మాట్లాడే అవకాశమే లేదు కదా..? ఐతే మీరు.. మీ బామ్మర్ది… మీ మామే కదా..? మాట్లాడింది. కనీసం హోంమంత్రిని కూడా ప్రజా భవన్‌కు రానియని చరిత్ర మీది. సామాన్య కార్యకర్తలే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. దళితులు.. బలహీన వర్గాల బిడ్డలం కేబినెట్‌లో ఉన్నాం. బడుగు.. బలహీన వర్గాలు అంటే నీకు ఎందుకు అంత చిన్నచూపు. కేబినెట్ మీద విషం కక్కినావు. హరీశ్‌రావు నామినేషన్ వేసే సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంకి రమ్మంటే తోక ముడిచాడు. హరీశ్‌రావు… అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తా అని.. ఇప్పటి మేము కాదు.. మా కొప్పుల ఈశ్వర్ వస్తాడు అంటున్నారు. తోక ముడిచావు హరీశ్‌రావు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడటం మానుకో.’’ అంటూ మంత్రి లక్ష్మణ్ హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Harish Rao: రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్

Exit mobile version