NTV Telugu Site icon

BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..

Cm Chandran=babu Naidu

Cm Chandran=babu Naidu

BRS MLAs: ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

Read also: Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు

టీడీపీలో చేరుతాం.. తీగల కృష్ణా రెడ్డి..! మరి మల్లారెడ్డి..?

చంద్రబాబుతో భేటీ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లతో కలిసి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తానని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో సైబరాబాద్, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందాయని తీగల కృష్ణా రెడ్డి కొనియాడారు. మరోవైపు మీడియాతో మాట్లాడకుండానే మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చకు దారి తీసింది. కాగా.. అయితే చామకూర మల్లారెడ్డి 2014 వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే.. టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు చంద్రబాబుతో మల్లారెడ్డి భేటీ హాట్ టాపిక్ గా మారింది.
Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క