NTV Telugu Site icon

Meenakshi Natarajan: పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది తెలుసు

Meenakshi

Meenakshi

Meenakshi Natarajan: గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసింది. ఇక, పని తీరు నివేదికలు ఇచ్చారు నేతలు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పని తీరు ఏంటని తెలుసు అన్నారు. పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు అని ఘాటుగా స్పందించింది. పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించింది. నా పని తీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చు అని పేర్కొన్నారు. కానీ, అంతర్గత విషయాలు బయట మాట్లాడకండి అని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు.

Read Also: Stock Market: మార్కెట్‌కు సరికొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

అయితే, తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇటీవల కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, బహిరంగ విమర్శలతో హస్తం పార్టీ పరువు తీసేలా కొందరు నేతలు హద్దులు దాటుతున్నారు. ఇక, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే నిర్దాక్ష్యణ్యంగా గెంటేస్తామని హైకమాండ్ నుంచి హెచ్చరిలు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నటరాజన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే తీన్మార్ మల్లన్నపై సస్పెషన్ వేటు పడగా.. తాజాగా మెదక్ పార్లమెంట్ సమావేశంలో శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్. గొడవలు గాంధీ భవన్ గేటు దాటకూడదన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే ఇంటికి సాగనంపుతానంటూ వెల్లడించారు.