Site icon NTV Telugu

Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రచారం.. గ్రామస్థాయి నుంచే జరగాలి..

Meenakshi

Meenakshi

Meenakshi Natarajan: హైదరాబాద్ లో పరిశీలకుల సమావేశం ముగిసింది. జిల్లాకు ఇద్దరు పరిశీలకుల కేటాయించారు. మండల అధ్యక్షుల ఎంపికకు ఐదుగురి పేర్లు.. బ్లాకు కాంగ్రెస్ కి ముగ్గురు పేర్లు పీసీసీకి ఇవ్వాలి.. 70 మంది పరిశీలకులకు ఆహ్వానం పంపించాలని ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలిపింది. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వాళ్ళను పరిశీలకులుగా పీసీసీ తొలగించింది. మీటింగ్ కి రాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు నేతలు.. పరిశీలకుల నుంచి వీళ్ళను తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళనే కమిటీలో ఉండాలని తెలిపింది. అలాగే, మహిళల ప్రాతినిధ్యం పెంచుకోవాలి.. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు జరగనున్నాయని ప్రకటించింది.

Read Also: Pahalgam Terror Attack: ఉగ్రవాదులను ఏరివేయడంలో అజిత్ దోవల్ దిట్ట.. అజిత్ తదుపరి వ్యూహం ఏంటి?

ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బ్రిటిష్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది.. కాంగ్రెస్ పార్టీ విస్తృత భావజాలం ఉన్న పార్టీ.. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుంది.. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి అని సూచనలు చేసింది. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పని చేయాలని హెచ్చరించింది. ఈ దేశంలోనే మొదటి సరిగా తెలంగాణలో కుల ఘణన చేసి 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.. అయితే, దేశంలో మోడీ సర్కార్, గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది.. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని మీనాక్షి నజరాజన్ పేర్కొన్నారు.

Exit mobile version