Site icon NTV Telugu

Heavy Rains: హైదరాబాద్‌లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్..

Hyd

Hyd

Heavy Rains: నైరుతి రుతు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ముందుగానే వర్షాకాలం వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అకాల వర్షాలతో ప్రజలకు చుక్కులు కనిపిస్తున్నాయి. దీంతో మహా నగరం హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిస్తుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లిలో వర్షం పడుతుంది.

Read Also: Tabu : టబు’తో రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఇబ్బంది లేదు..

అయితే, వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక, ఉత్తర తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Exit mobile version